ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 : బోటుకు యాంకర్ తగిలించేందుకు విశాఖ నిపుణుల విముఖత

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట-2 పనులు నిలిచాయి. యాంకర్, ఐరన్ రోప్ లను ఒడ్డుకి చేర్చారు. బోటుకు యాంకర్ తగిలించేందుకు విశాఖ

  • Publish Date - October 19, 2019 / 07:37 AM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట-2 పనులు నిలిచాయి. యాంకర్, ఐరన్ రోప్ లను ఒడ్డుకి చేర్చారు. బోటుకు యాంకర్ తగిలించేందుకు విశాఖ

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట-2 పనులు నిలిచాయి. యాంకర్, ఐరన్ రోప్ లను ఒడ్డుకి చేర్చారు. బోటుకు యాంకర్ తగిలించేందుకు విశాఖ నిపుణులు విముఖత చూపారు. నీరు బురదగా ఉండటంతో అడుగు భాగానికి వెళ్లి బోటుకి యాంకర్ తగిలించేందుకు నిపుణులు ముందుకు రావడం లేదు. దీంతో బోటు వెలికితీత పనులు నిలిచాయి. సీ డైవర్స్ ని ఒప్పించేందుకు ధర్మాడి సత్యం బృందం వెళ్లింది. నాలుగో రోజూ ఆపరేషన్ రాయల్ వశిష్ట పనులు చేపట్టారు. నది అడుగు భాగానికి వెళ్లి రోప్ బిగిస్తేనే బోటుని వెలికితీసే అవకాశం ఉందని ధర్మాడి సత్యం బృందం చెప్పింది. మరో 10 మీటర్లు ఒడ్డు వైపు చేర్చగలిగితే బోటును సులభంగా వెలికితీయొచ్చని వెల్లడించింది. అయితే బోటుకి యాంకర్ తగిలించే వారు కరువయ్యారు.

శనివారం (అక్టోబర్19, 2019) కూడా బోటు వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత పద్ధతినే ఫాలో కానున్నారు. ప్లాన్‌ ఏ, బీలను మిక్స్‌ చేసి బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించనుంది ధర్మాడి బృందం. అయితే బోటు నెలరోజులకు పైగా నీటిలో నానిపోయింది. ఈ క్రమంలో యాంకర్‌కు తగిలినప్పటికీ… శకలాలు తప్ప పూర్తిస్థాయిలో బోటు రావడం కష్టమేనని తెలుస్తోంది.

నెల రోజుల క్రితం గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పర్యాటక బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వ ప్రయత్నం చేస్తోంది. నిన్న ఉదయం పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసేందుకు యాంకర్,; ఐరన్‌ రోప్‌ను ఉచ్చు మాదిరిగా గోదావరిలోకి వదిలి పొక్లెయిన్‌ సాయంతో లాగారు. అయితే, యాంకర్‌ తగులుకుని పట్టు జారిపోయింది. నిన్న సాయంత్రం మరోసారి యాంకర్‌ను నీటిలోకి వదిలి ఐరన్‌ రోప్‌ను రెండుసార్లు బోటు చుట్టూ గోదావరిలోకి విడిచిపెట్టారు. అదే సమయంలో వర్షం కురవడంతో వెలికితీసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది.