రాయల్ వశిష్ట బోటు గోదావరి గర్భం నుంచి బయటికొస్తుందా? బోటును ధర్మాడి సత్యం అండ్ టీమ్ తీయగలదా? సముద్రంలోని మునిగిన పడవలను అలవోకగా తీయగలిగిన
గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత ప్రశ్నార్థకంగా మారింది. వరుసగా రెండవ రోజు(అక్టోబర్ 4,2019) కూడా సెర్చ్ ఆపరేషన్ పనులు నిలిచిపోయాయి. గోదావరిలో వరద ప్రవాహం, సుడిగుండాలు తగ్గకపోవడంతో శుక్రవారం(డే 5) కూడా సెర్చ్ ఆపరేషన్‌కు అధికారులు అనుమతించ లేదు. దీంతో ధర్మాడి సత్యం బృందం దేవీపట్నానికే పరిమితమైంది. ఇప్పటికే మూడు రోజులపాటు చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వకపోగా… ప్రతికూల వాతావరణంతో బుధవారం, గురువారం పనులు నిలిచిపోయాయి. మరోవైపు.. శుక్రవారం సాయంత్రంలోపు వరద ఉధృతి తగ్గకపోతే సెర్చ్ ఆపరేషన్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో… బోటు వెలికితీత సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు.. తమ బంధువుల కడచూపు అయినా దొరుకుతుందని ఆశిస్తున్నవారికి నిరాశ తప్పడం లేదు.
రాయల్ వశిష్ట బోటు గోదావరి గర్భం నుంచి బయటికొస్తుందా? బోటును ధర్మాడి సత్యం అండ్ టీమ్ తీయగలదా? సముద్రంలోని మునిగిన పడవలను అలవోకగా తీయగలిగిన ధర్మాడి బృందం గోదావరిలో మునిగిన బోటును.. బయటకు తీసేందుకు ఎందుకు చెమటోడుస్తోంది? 4వ రోజు(అక్టోబర్ 3,2019) పనులు ఎందుకు నిలిచిపోయాయి?
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికితీయడం రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. ఇప్పటికే మూడు రోజులపాటు చేసిన ప్రయత్నాలు విఫలమవగా.. నాలుగో రోజు(అక్టోబర్ 3,2019) వెలికితీత పనులకు గోదావరి వరద బ్రేక్ వేసింది. గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో.. నాలుగో రోజు బోటు వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పంటును గోదావరి ఒడ్డున లంగర్ వేయగా.. రెస్క్యూ ఆపరేషన్ సామాగ్రి అంతా గట్టునే ఉండిపోయింది. కచ్చులూరు ప్రాంతంలో నిశబ్దం వాతావరణం నెలకొంది.
నాలుగో రోజు ఆపరేషన్ మొదలైతే.. బుధవారం వేసిన యాంకర్‌కు అనుబంధంగా మరో రెండు, మూడు యాంకర్లను వేసి బోటును బయటకు లాగాలని ధర్మాడి సత్యం బందం భావించింది. అయితే … ప్రమాద ప్రాంతంలో సుడిగుండాలు ఎక్కువగా ఉండటం, ఇప్పటికే కురిసిన భారీ వర్షంతో నదిలో నీటి ఉధృతి, నీటిమట్టం పెరుగుతుండటంతో ఆపరేషన్ వశిష్టను కొనసాగించేందుకు అధికారులు సైతం అనుమతి నిరాకరించారు. వరద తగ్గేవరకు కచ్చులూరుకు వెళ్లొద్దని సూచించారు. గోదావరికి వరద పెరగడంతో.. నది ఉధృతికి పంటు నిలబడే పరిస్థితి లేదని ధర్మాడి సత్యంతో కలిసి పనిచేస్తున్న శివ తెలిపారు. సుడిగుండాలు పంటును కూడా నదిలోకి లాగేసే ప్రమాదముందని చెప్పారు.
సోమవారం(సెప్టెంబర్ 30,2019) నుంచి బోటు వెలికితీతకు ప్రయత్నిస్తోంది ధర్మాడి సత్యం బృందం. మొదటి రోజు పడవ మునిగిన ప్రాంతంలో 2 వేల మీటర్ల పొడవైన ఐరన్ రోప్‌ను వలయంగా వేశారు. దానిని గోదావరి ఒడ్డున ఉంచిన జేసీబీలకు కట్టారు. రోప్‌ను పైగి లాగుతుండగా తెగిపోయింది. సుమారు వెయ్యి మీటర్ల రోప్ గోదావరిలోనే ఉండిపోయింది. మొదటిరోజు ఫలితం దక్కకపోవడంతో మంగళవారం బోటు వెలికితీత ప్లాన్ మార్చింది. ఈ సారి రోప్‌తో కాకుండా యాంకర్‌ను గోదావరిలోకి జార విడిచారు. యాంకర్ బలమైన వస్తువుకు తగిలింది. దానిని లాగే క్రమంలో యాంకర్ పళ్లు విరిగాయి. దీంతో.. రెండో రోజు పనులు నిలిచాయి. బుధవారం ధర్మాడి బృందం కొత్త యాంకర్‌తో వేట కొనసాగించింది. మధ్యాహ్నం సమయానికి ఆ యాంకర్ బలమైన వస్తువుకు తగిలింది. అయితే ఈలోగా వర్షం రావడం, వరద పెరగడంతో.. యాంకర్‌ను అలాగే ఉంచి పనులు నిలిపివేశారు.
నాలుగో రోజు మరోసారి ప్రయత్నించాలని అనుకున్నా ప్రతికూల వాతావరణంతో నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు రోజులపాటు చేసిన ప్రయత్నాలు ఫెయిలవడంతోపాటు… ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో బోటును వెలికితీయడం సాధ్యమవుతుందో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది.