హుజూర్ నగర్‌లో ఉప ఎన్నిక : నామినేషన్ వేసిన పద్మావతి 

  • Publish Date - September 26, 2019 / 11:02 AM IST

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రచారం జోరందుకుంది. ఈ ఉప ఎన్నిక పోరు ప్రధాన పార్టీలకు కత్తి మీద సాములా మారాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి.   

ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 7 వేల ఓట్లతో ఓటమిపాలైన సైదిరెడ్డిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి హుజూర్ నగర్ ఎన్నికలబరిలో నిలిచారు. ఉప ఎన్నికల్లో భాగంగా హూజూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో పద్మావతి తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు.

అన్ని ప్రధాని పార్టీలు గెలపు ఎవరికివారే విజయంపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసిన గెలుపు తమదేనంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. హుజూర్ నగర్ ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యానించి పద్మావతి గెలుపు కచ్ఛితంగా మాదేనన్నారు. మరోపక్క హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగురవేస్తామంటూ టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.  

ఇదిలా ఉంటే బీజేపీ కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ధీటుగా ఉండే బలమైన అభర్థిని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ..కీసర శ్రీకళారెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ శ్రీకళారెడ్డి ఎవరు అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతోంది. 

గత ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. టిఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన సైది రెడ్డి పై విజయం సాధించారు. అయితే ఆ తరువాత ఎంపీ ఎన్నికల్లో పోటీచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గాను విజయం సాధించడంతో, హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. దీంతో హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో ఎలాగైనా సరే హుజూర్ నగర్ సీట్ ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.