గేదెను ఢీకొన్న ప్యాసింజర్ రైలు : నిలిచిపోయిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు

ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి ఖాజీపేట వెళ్లే ప్యాసింజర్ రైలు బోనకల్లు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి నాగులవంచ సమీపంలో ఓ గేదెను ఢీకొనడంతో ఇంజన్‌లో సమస్య తలెత్తింది.

  • Publish Date - December 17, 2019 / 03:50 PM IST

ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి ఖాజీపేట వెళ్లే ప్యాసింజర్ రైలు బోనకల్లు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి నాగులవంచ సమీపంలో ఓ గేదెను ఢీకొనడంతో ఇంజన్‌లో సమస్య తలెత్తింది.

ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి ఖాజీపేట వెళ్లే ప్యాసింజర్ రైలు బోనకల్లు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి నాగులవంచ సమీపంలో ఓ గేదెను ఢీకొనడంతో ఇంజన్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఇదే మార్గంలో విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఇంటర్‌సిటీ, సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, చెన్నై నుంచి నిజాముద్దీన్ వెళ్లు నవజీవన్‌రైలు కూడా బోనకల్లు రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. 

సమాచారం తెలుసుకున్న సాంకేతిక సిబ్బంది వచ్చినా ఫలితం లేకపోవడంతో మరో ఇంజిన్ వచ్చి బోగీలను తగిలించుకొని వెళ్లింది. ప్రయాణికులు 1 గంట 10 నిమిషాలు పాటు నిరీక్షించాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.