జనసేన పార్టీకి పసుపులేటి బాలరాజు గుడ్ బై చెప్పే యోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోలీసులు చేసిన బాలరాజు కొంతకాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (నవంబర్ 3)న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ఒకరోజు ముందు..అంటే శనివారం బాలరాజు పార్టీకి రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై స్పష్టతరాలేదు. ఎన్నికల తరువాత ఘోరంగా జనసేన పార్టీ ఓడిపోయిననాటినుంచి బాలరాజు పార్టీకి దూరంగా ఉంటున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా సేవలు పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీ తరపున పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన బాలరాజుకు గిరిజన ప్రాంతాల్లో మంచి పేరు ఉంది.