అనారోగ్యం కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు.
అనారోగ్యం కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పవన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఎడతెరిపి లేని సభల కారణంగా పవన్ కల్యాణ్ వడదెబ్బతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వడదెబ్బ కారణంగా సత్తెనపల్లి, తెనాలి ఎన్నికల ప్రచారాన్ని పవన్ వాయిదా వేసుకున్నారు.
Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో
అంతకుముందు విజయనగరం జిల్లా అయోధ్య మైదానంలో స్టేజ్‌పై ప్రసంగిస్తుండగా .. ఓ అభిమాని అత్యుత్సాహం వల్ల ఆయన కిందపడిపోయారు. కాసేపు విరామం అనంతరం తిరిగి పవన్ ప్రసంగాన్ని ప్రారంభించారు. విజయనగరం ఎన్నికల ప్రచారంలో పవన్ నీరసంగా కనిపించారు.
Read Also : టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం