జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారా? అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రెండు నియోజకవర్గాలను పోటీ చేసేందుకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పవన్ కోసం రెండు నియోజకవర్గాలను పార్టీ జనరల్ బాడీ ఫైనల్ చేసినట్లు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అవి ఏఏ స్థానాలు అనేది గంటలో వెల్లడిస్తానంటూ పవన్ ట్వీట్ చేశారు.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు
పవన్‌కల్యాణ్ పోటీ చేసే ఒక స్థానం విశాఖ జిల్లా గాజువాక అని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. మరో స్థానం పిఠాపురం అని చెబుతున్నారు. అయితే రాయలసీమ నుండి కూడా ఒక స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్న సమయంలో చిరంజీవి కూడా 2చోట్ల పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేశారు. అప్పుడు తిరుపతి నుండి మాత్రమే చిరంజీవి నెగ్గారు.
General body is in their final discussion from which two constituencies , I should be contesting.
Hopefully,they will let me know in an hour or later.— Pawan Kalyan (@PawanKalyan) 19 March 2019