ఏపీ నుంచి పరిశ్రమలు తరలి పోతున్నాయ్..మొత్తం ఖాళీ చేయించేస్తారా : ప్రభుత్వంపై  పవన్ ఫైర్

  • Publish Date - February 6, 2020 / 10:46 AM IST

సీఎం జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ఏపీ నుంచి పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన ‘కియా’మోటార్ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందనే వార్త తనను షాక్ కు గురించేసిందని పవన్ తెలిపారు. ఉద్యోగాలను కల్పించే పరిశ్రమలన్నీ తరలిపోతుంటే ఉపాధి అవకాశాలను ఎలా మెరుగుపరుస్తారు అంటూ ఈ సందర్భంగా పవన్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. 

జగన్ సీఎం అయ్యాక..విశాఖపట్నం నుంచి సాఫ్ట్ వేర్ సంస్థల్ని ఖాళీ చేయించేశారు. ప్రకాశం జిల్లాకు రావాల్సిన కాగితం పరిశ్రమ కర్ణాటకకు వెళ్లిపోయింది. ఉపాధిపై దృష్టి పెట్టకుండా కూల్చివేతలపైనా..టెండర్ల రద్దులపైనా దృష్టి పెడితే పరిస్ధితి ఇలాగే ఉంటుందని పవన్ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం అనాలోచిత వైఖరితోనే ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయనీ..ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలనీ లేకుండా ఏపీకి పాత పెట్టుబడులు పోవటం..కొత్తగా పెట్టుబడులు వచ్చే పరిస్ధితి ఉండదని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఇప్పటి ఏపీ పరిస్థితికి పెట్టుబడులు లేకుండా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముఖ్యంగా యువతకు ఉపాధి లేకుండా పోతుందని పవన్ ప్రభుత్వానికి సూచించారు. 

కాగా..1.1బిలియన్ డాలర్లతో  ఏర్పాటైన కియ పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడుకు తరలింపు ‘కియా’మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుంది అనే వార్తలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ‘కియ’మోటార్ సంస్థ ఏపీనుంచి తరలిపోతుందని రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ప్రచురించాయి. ఈ కథనాలు పెను సంచనలం కలిగించారు. ఈ అంశంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం ఉపాధిపై దృష్టి పెట్టకుండా కూల్చివేతలు..రద్దులు అంటూ కూర్చుందని ఎద్దేవా చేశారు.  

ట్రెండింగ్ వార్తలు