పవన్ కళ్యాణ్ కు తీవ్ర అనారోగ్యం

జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరబెట్టింది. దీంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే

  • Publish Date - September 26, 2019 / 12:22 PM IST

జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరబెట్టింది. దీంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే

జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరబెట్టింది. దీంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే తెలిపారు. కొద్ది రోజులుగా వెన్నెముక నొప్పితో పవన్ బాధపడుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో వేగం తగ్గించడానికి కారణం అదే వెల్లడించారు.

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు అయ్యాయని, అప్పటి నుంచి తరచూ వెన్ను నొప్పి బాధిస్తోందని పవన్ తెలిపారు. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడంవల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగిందన్నారు. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినా సంప్రదాయ వైద్యం పై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నా అని చెప్పారు. కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్‌ పెయిన్‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని, ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా అని ప్రకటనలో పవన్ తెలిపారు

విజయవాడలో మీడియా ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్ పవన్ ని ఆహ్వానించారు. దీనికి స్పందించిన పవన్.. సమావేశానికి తాను హాజరుకాలేనని చెబుతూ ప్రకటన విడుదల చేశారు. ‘మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరఫున, నా తరఫున వ్యక్తిగతంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసకు గాయమైంది. అప్పటి నుంచి అది వేధిస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అశ్రద్ధ చేయడం వల్ల అది మరింత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం మీద నమ్మకంతో ఆ దిశగా ముందుకు వెళ్తున్నా. కొన్ని రోజులుగా మళ్లీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మీరు నిర్వహించే సమావేశానికి జనసేన తరఫున ప్రతినిధులు మీడియా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు’ అని పవన్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు