సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి-29,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు.మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్-1,2019న మరోసారి ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారని తెలిపారు.ఏప్రిల్-1న హైదరాబద్ లోని ఎల్ బీ స్టేడియంలో ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడతారని లక్ష్మణ్ తెలిపారు.
అదేవిధంగా ఏప్రిల్-4,2019నుంచి తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ప్రారంభమవుతుందని తెలిపారు.వరంగల్చకరీంనగర్ బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారని తెలిపారు.ఏప్రిల్-6,2019న నల్గొండ,హైదరాబాద్ లో రోడ్ షోలలో అమిత్ షా పాల్గొంటారని లక్ష్మణ్ తెలిపారు.పలువురు కేంద్రమంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.17లోక్ సభ స్థానాలున్న తెలంగాణలో మొదటివిడతలోనే ఏప్రిల్-11,2019న ఎన్నికలు జరుగనున్నాయి.మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.