పోలీస్ అకాడమీ డైరక్టర్ వికే సింగ్ సంచలన కామెంట్స్

  • Publish Date - October 3, 2019 / 04:06 PM IST

పోలీస్ అకాడమీ డైరక్టర్ వినయ్ కుమార్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో పోలీసులకు ఇచ్చే శిక్షణ తీరు మారాలన్నారు. వారిపై దుబార ఖర్చులు తగ్గించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి నేషనల్ పోలీసు అకాడమిలో ఆయన మాట్లాడుతూ వేలకోట్లు శిక్షణలో ఖర్చు చేస్తున్నా.. ఏమి లాభం లేకుండా పోతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పోలీస్ అకాడమీ కోసం చేస్తున్న ఖర్చు వృధానే అని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీస్ అకాడమీ వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీకి కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. పోలీసుల ప్రదర్శన సరిగా లేదని విమర్శించారు. జైల్లో ఉన్న ఖైదీల్లో 90 శాతం పేదవాళ్లేనని తెలిపారు. అకాడమీలో అక్టోబర్ 24వ తేదీ నుండి శిక్షణ ప్రారంభిస్తున్నామని వినయ్ కుమార్ చెప్పారు.