అమరావతితో ఆందోళన చేస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చినకాకాని హైవే వద్దకు అమరావతి ప్రాంత రైతులు భారీగా చేరుకున్నారు. అనంతరం హైవేని నిర్భంధించి తమ నిరసనను తెలిపారు. జై అమరావతి..సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా..సీఎం జగన్ సెక్రటేరియట్ కు రానున్నరారు. ఈ క్రమంలో పోలీసులు జగన్ సెక్రటేరియట్ కు వెళ్లే దారిలో పోలీసులు భారీగా మోహరించారు. వెలగపూడి వరకూ భారీ పోలీసు బందోబస్తుతో సీఎం జగన్ సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. ఈ దారిలో ఆందోళన కారులు అడ్డుకుంటారనే ఉద్ధశంతో పలు ప్రాంతాల్లో ఇనుప కంచెలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ ప్రాంతంలోని మెడికల్ షాపులతో సహా అన్ని షాపుల్ని మూసివేయిస్తున్నారు. గ్రామంలోని ప్రాథమిక వైద్య కేంద్రాలు, కూరగాయల షాపులతో పాటు మెడికల్ షాపులను కూడా మూసివేయిస్తుండటంతో స్థానికులు మండిపడుతున్నారు.
సీఎం సెక్రటేరియట్ కు వెళ్లాల్సి వస్తే అత్యవసర సేవలు బంద్ చేయటమేంటి ఇది ఎక్కడన్నా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కానీ ఇవేవీ పోలీసులు పట్టించుకోవటంలేదు. సీఎం వచ్చి వెళ్లేవరకు షాపులు బంద్ చేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. పోలీసుల తీరుపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.