గుప్త నిధుల కోసం పోలీసుల తవ్వకాలు

  • Publish Date - October 25, 2019 / 09:12 AM IST

గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేవారిని అరెస్ట్ చేసే పోలీసులే గుప్తనిధుల కోసం ఆశపడ్డారు. వాటి కోసం తవ్వకాలు జరిపి పట్టుపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెల్పులపల్లిలో కలకలం సృష్టించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురు పోలీసులతో సహా నలుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో భువనగిరి హోంగార్డు కానిస్టేబుల్ రామకృష్ణ, చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, మరో కానిస్టేబుల్  ప్రభాకర్ ఉన్నారు. 

తుర్కపల్లి మండలంలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇది తెలుసుకున్న పోలీసులు వాటిపై ఆశపడ్డారు. దీంతో ఈ ప్రాంతాలలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే సమచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ నిఘాలో స్థానికేతర పోలీసులు తవ్వకాలు జరిపారని తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు  సదరు పోలీసులను అరెస్ట్ చేశారు. అనంతరం తవ్వకాల్లో బైటపడ్డ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనితో ఇంకా ఎవరికి సంబంధాలున్నాయి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

నేరాలను అరికట్టాల్ని పోలీసులే గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతుండటంపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేసులో పట్టుబడ్డి కానిస్టేబుల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.