జయరాం భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.
విజయవాడ : జయరాం భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. శ్రిఖా చౌదరి ప్రమేయం లేకుండా రాకేశ్ రెడ్డి తన భర్తను హత్య చేసే అవకాశం లేదని పద్మశ్రీ స్పస్టం చేసింది. విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసింది. ’శ్రిఖా చౌదరే నా భర్త హత్యకు ప్రధాన సూత్రధారి’ అని తెలిపారు.
జయరాం అమెరికన్ సిటిజన్ కావడంతో పద్మశ్రీ పాస్ పోర్టును అమెరికన్ ఎంబసీకి అందజేయనుంది. జయరాం డెత్ సర్టిఫికెట్, ఎఫ్ ఐఆర్ కాపీ కావాలని పద్మశ్రీ కోరింది. హత్యకేసులో శ్రిఖా చౌదరి పాత్ర లేదని పోలీసులు తేలిస్తే న్యాయపోరాటం చేస్తానన్నారు. తమ కంపెనీల బోర్డ్ మీటింగ్ లకు పెట్టి శ్రిఖా చౌదరిని డైరెక్టర్ గా తప్పించాలని పద్మశ్రీ నిర్ణయించారు.