కొబ్బరి పొంగలి, చక్కెర పొంగలి తయారీ విధానం

అసలు పొంగలి అనగానే మనకు వెంటనె గుర్తొచ్చేది కొత్త బియ్యం. ఆ బియ్యాంలో పాలు  పోసి కాసింత బెల్లం కలగలిస్తే రుచులూ పొంగుతాయి...

  • Publish Date - January 11, 2019 / 03:49 AM IST

అసలు పొంగలి అనగానే మనకు వెంటనె గుర్తొచ్చేది కొత్త బియ్యం. ఆ బియ్యాంలో పాలు  పోసి కాసింత బెల్లం కలగలిస్తే రుచులూ పొంగుతాయి…

అసలు పొంగలి అనగానే మనకు వెంటనె గుర్తొచ్చేది కొత్త బియ్యం. ఆ బియ్యాంలో పాలు పోసి కాసింత బెల్లం కలగలిస్తే రుచులూ పొంగుతాయి… సంక్రాంతికీ సరదాగా కొత్త బియ్యం తో కొబ్బరి పొంగలి, చక్కెర పొంగలి, తయారు చేయడానికి ఒక రుచికరమైన మార్గం. మీరు కుడా ప్రయత్నించండి.  

కొబ్బరి పొంగలి:
కావలసిన పదార్దాలు:
బియ్యం 200 గ్రా, పెసరపప్పు 50 గ్రా, పచ్చి కొబ్బరి తురుము 50 గ్రా, బెల్లం 200 గ్రా, జీడిపప్పు 8, కిస్మిస్ 8, పాలు అన్నింటికి తగినంత, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు.

తయారీ విధానం:
బియ్యం, పెసర పప్పు కడిగి అరగంట నానబెట్టి తర్వాత మెత్తగా ఉడికించాలి. ఈ లోపుగా బెల్లాన్ని పొడి చేసుకోవాలి. బియ్యం ఉడికిన తర్వాత పాలు, బెల్లం, కొబ్బరి తురుము కలిపి మంట తగ్గించి దగ్గర పడే వరకు ఉడికించాలి. నేతిలో వేయించిన జీడి పప్పు, కిస్మిస్ ను, ఏలకుల పొగిని వేసి కలిపి దించేయాలి. 

చక్కెర పొంగలి:
కావాలసిన పదార్దాలు:
బియ్యం ఒక కప్పు, పెసర పప్పు అరకప్పు, పాలు ఒక కప్పు, చక్కెర అరకప్పు, జీడిపప్పు 8, కిస్మిస్ 8, కొబ్బరి ముక్కలు 6, ఏలకుల పొడి ఒక టే్బుల్ స్పూన్, నెయ్యి 5 టే్బుల్ స్పూన్లు.

తయారి విధానం:
పెనంలో ఒక స్పూన్ నెయ్యి వేసి పెసర పప్పును దోరగా వేయ్యించాలి. దీనికి బియ్యం కలిపి నాలుగు గ్లాసుల నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. తరవాత పాలు ,చక్కెర వేసి మరికెద్ది సేపు ఉడికించి ఏలకుల పొడి కలపాలి. మిగిలిన నేతిలో జీడిపప్పు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేయ్యించి మొత్తాన్ని ఉడికించి పొంగలిలో వేసి కలపాలి.