వైద్యం చేయించలేక కన్నకూతుర్నేగొంతునులిమి చంపేసిన తండ్రి

  • Publish Date - February 17, 2020 / 09:54 AM IST

పేదవారికి రోగం వస్తే చచ్చిపోవాల్సిందేనా? పేదవారికి పుట్టిన పిల్లలు రోగం వస్తే ఆ రోగాన్ని నయం చేసే స్థోమత లేకపోయే వారిని చేజేతులా చంపుకోవాల్సిందేనా?చేతిలో చిల్లిగవ్వ లేక బిడ్డను బతికించుకునే స్తోమత లేని ఓ తండ్రి తన కన్నబిడ్డనే చేతులారా చంపేశాడు. బిడ్డకు వచ్చిన అనారోగ్యాన్ని బాగుచేయించులేనని ఆ తండ్రి కన్నబిడ్డ పాలిటన కసాయివాడయ్యాడు. గొంతు నులిమి చంపేశాడు. అనారోగ్యం వచ్చి చచ్చిపోయిందని నమ్మించాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఆర్ధిక సమస్యల ముందు కన్నప్రేమ కర్కశంగా మారింది. చిన్నారి ఉసురు తీసింది. 

వివరాల్లోకి వెళితే..వికారాబాద్ జిల్లాలోని జామాపూర్ తండాకు చెందినవాడు రవినాయక్.బ్రతుకుతెరువు కోసం రవినాయక్ సంగారెడ్డి జిల్లా  సదాశివ మండలంలోని ఆత్మకూరుకు వలస వెళ్లాడు. అక్కడే తాపీపని చేసుకుంటూ  చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో రవినాయక్ మొదటిభార్య కుమార్తె రేణుక నవాబు పేటలోని కస్తూరిబా గాంధీ బాలికల స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. 

ఈ క్రమంలో రేణుకకు జ్వరం వచ్చింది. దీంతో రవినాయక్ కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు. జ్వరం ఎక్కువైంది. సదాశివ పేటక బయల్లేరాడు. దారి మధ్యలో రేణుక నాన్నా..దాహం వేస్తోంది మంచినీళ్లు కావాలని అడిగింది. నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన రవినాయక్ జ్వరం తగ్గటానికి మందు రాస్తానని చెప్పి రేణుక గొంతు నులిమి చంపేశాడు. 

తరువాత కూతురుకి ఎక్కిళ్లు వచ్చి ఊపిరి ఆడక చచ్చిపోయిందని భార్య బుజ్జిని నమ్మించాడు. తరువాత కూతురి అంత్యక్రియలకు తమ స్వగ్రామం అయిన వికారాబాద్ జిల్లాలోని తమ తండాకు తీసుకెళ్లాడు.  ఈ క్రమంలో అత్యక్రియల కార్యక్రమంలో రేణుక గొంతుపై కమిలిన గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు..బంధువులు అనుమానాలు వ్యక్తంచేశారు. వెంటనే వీఆర్వోకు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణుకను పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రేణుక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం చేయించారు. రిపోర్ట్ లో రేణుక హత్యకు గురైందని తేలింది. దీంతో పోలీసులు రవినాయక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించటంతో అసలు విషయాన్ని బైటపెట్టాడు.. 

గతంలో కూడా రేణుకకు ఇలాగే జ్వరం రావటంతో సదాశివపేటలో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించి..రూ.20వేలు ఖర్చు చేసి వైద్యం చేయించాడు. కానీ తరచూ రేణుక జ్వరం పడటంతో వైద్యం కోసం చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయనీ భావించిన ఆ తండ్రి కన్నకూతుర్నే చంపేసిన దారుణానికి ఒడిగట్టానని చెప్పాడు రవినాయక్. దీంతో రవినాయక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.