ఉద్దండరాయపాలెంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆందోళనకారులు మీడియాపై దాడికి దిగారు.
ఉద్దండరాయపాలెంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆందోళనకారులు మీడియాపై దాడికి దిగారు. అయితే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. ఉద్దండరాయపాలెంలో రైతులు చేస్తున్న దీక్షను కవరేజ్ చేయడానికి మీడియా ప్రతినిధులపై వెళ్లింది. దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి సచివాలయానికి వచ్చే మార్గంమధ్యలో కొంతమంది మీడియా ప్రతినిధులపై రైతులు దాడి చేశారు.
మీడియా ప్రతినిధులు వస్తున్న కారుపై దాడికి పాల్పడ్డారు. కారును ధ్వంసం చేసి, టైర్లలో గాలి తీసేశారు. సచివాలయానికి వచ్చే మార్గంమధ్యలో మూడు, నాలుగు మీడియా వాహనాలపై ఒక్కసారిగా ఆందోళనకారులు దాడికి దిగారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు వచ్చి మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ ఆందోళనకారులను అదుపు చేయలేని పరిస్థితి ఉండటంతో చూస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉద్దండరాయపాలెంలో కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష విరమంచిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు నుంచి ఐదుగురు మీడియా ప్రతినిధులకు గాయాలైనట్లు సమాచారం. వారందరూ స్థానిక పోలీస్ స్టేషన్ ల కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని పట్ల జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాజధాని మార్పు వివాదం కొన్నిరోజులుగా సాగతుంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఆందోళనలను కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. దాడులు చేయడం సబబు కాదంటున్నారు.