ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా సోమవారం(మార్చి-25,2019) రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 184పరుగులు చేసింది.బౌండరీలతో చెలరేగిన క్రిస్ గేల్(79),సర్ఫాజ్ ఖాన్(46),మయాంక్ అగర్వాల్(22),నికోలాస్ పురాన్(12),మన్ దీప్ సింగ్(5),లోకేష్ రాహుల్(4)పరుగులు చేశారు.
పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గ్రౌండ్ లో బౌండరీల వర్షం కురిపించాడు.నాలుగు సిక్స్ లు,ఎనిమిది ఫోర్లతో చెలరేగిపోయాడు.47 బంతులు ఆడిన గేల్ 79 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.స్టోక్స్ వేసిన 16వ ఓవర్లో మొదటి నాలుగు బంతులనూ బౌండరీకి తరలించిన గేల్.. ఐదో బంతికి బౌండరీ లైన్ వద్ద త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక రాజస్థాన్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు, క్రిష్ణప్ప గౌతమ్ ఒకటి,దవాల్ కుల్ కర్ణి ఒక వికెట్ తీశారు.