73 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన శస్త్రచికిత్స

  • Publish Date - December 20, 2019 / 10:18 AM IST

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధురాలికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కడుపులో ఉన్న 5 కేజీల కణతిని అపరేషన్ చేసి తొలగించారు. 73 ఏళ్ల వృద్ధురాలు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ కు రూ.2లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 

డాక్టర్లు అపరేషన్ చేసి కడుపులో ఉన్న 5 కేజీల కణతిని తొలగించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అధునాతన పరికరాలు అందుబాటులో ఉండటంతో ఆపరేషన్ చేసి, కణతిని తొలగించామని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు వివిధ రోగాలతో బాధపడుతున్నారు. రోగాలు నయం చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్  ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

ఈ మేరకు రోగుల ప్రాణాలను కాపాడాలనే తలంపుతో డాక్టర్లు అరుదైన ఆపరేషన్లు చేసి, రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. గతంలో కూడా డాక్టర్లు ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.