మా త్యాగాలు,సెంటిమెంట్‌ను గుర్తించండి: హైపర్ కమిటీకి సీమ సంఘాల లేఖలు

  • Publish Date - January 7, 2020 / 06:08 AM IST

మా త్యాగాలను గుర్తించండి..మా సెంటిమెంట్ ను గుర్తించండి అంటూ హైపవర్ కమిటీకీ..సీఎం జగన్ కు రాయలసీమ ప్రజాసంఘాలు లేఖలు రాశాయి. రాయలసీమ వాసులు సెంటిమెంట్ ను గుర్తించాలని గతంలో కర్నూలులో ఉండే రాజధానికి తాము త్యాగం చేశామని ఆ విషయాన్ని దయచేసి గుర్తించుకుని..రాయలసీమకు రాజధానిని కేటాయించాలని పేర్కొంటూ లేఖలు రాశారు.  గత ప్రభుత్వాలు చేసిన మోసాలతో రాయలసీమ ప్రజలు చాలా విధాలుగా నష్టపోయారనీ..అభివృద్ధికి నోచుకోక వెనుకబాటుకు గురవుతున్నామని విన్నవించారు. రాయలసీమ నుంచి సీఎంలుగా పనిచేసినవారు కూడా సీమ అభివృద్ధి కోసం కృషి చేయలేదని దశాబ్దాల తరబడి రాయలసీమ నిర్లక్ష్యాలనికి గురవుతూ..వెనుకబాటులోనే ఉందన్నారు. 

ప్రధాన ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రాయలసీమ వాసులు ఎన్నో త్యాగాలు చేశారు.  రాయలసీమ త్యాగాలు, ఆత్మగౌరవాన్ని హైపర్ కమిటీ గుర్తించాలని..రాయలసీమ ప్రాంతాలకు న్యాయం చేయాలని..ఆ రీతిగా నిర్ణయం తీసుకోవాలని హైపవర్ కమిటీకి  ప్రజాసంఘాలు విజ్నప్తి చేశాయి. 

 కాగా..ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రతిపాదన చేసినప్పటి నుంచి పలు వాదనలు..డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. కాగా..ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రతిపాదన చేసినప్పటి నుంచి పలు వాదనలు..డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మూడు రాజధానుల్లో కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటల్ గా ప్రతిపాదించటంతో సీమ వాసులు భగ్గుమన్నారు. కర్నూలు నుంచి రాజధానికి గతంలో తరలించారు కాబట్టి ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన  వచ్చింది కాబట్టి రాయలసీమకు ప్రధాని రాజధాని ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణలు విడిపోయిన తరువాత కూడా రాయలసీమలోనే రాజధాని నిర్మించాలనే డిమాండ్స్ వచ్చాయి. కానీ సీఎంగా చంద్రబాబు పలువిధాలుగా ఆలోచించి అమరావతిని రాజధానిగా ప్రకటించటంతో సీమ వాసులు ఆకాంక్షలు నెరవేరలేదు. దీనిపై సీమ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి రాజధానుల విషయం తెరపైకి రావటంతో మరోసారి సీమ వాసులు తమ ప్రాంతంలో రాజధాని కోసం డిమాండ్ చేస్తున్నారు.

కాగా మూడు రాజధానులు అంశంపై సీఎం జగన్ ఇప్పటికే పలు కమిటీలు వేశారు. జీఎన్ రావు కమిటీ వేయగా ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆ కమిటీ నివేదికను అందించింది. తరువాత బోస్టన్ కమిటీ వేయగా ఆ కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ క్రమంలో మరో కమిటీ హైపవర్ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది. ఈ కమిటీ నివేదిక రేపు ప్రభుత్వానికి అందనుంది. ఈ క్రమంలో రాయలసీమ ప్రజాసంఘాలు సీఎం జగన్ కు హైపవర్ కమిటీకి లేఖలు రాశాయి. 

కాగా ప్రభుత్వం వేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసినా ఆ కమిటీలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వానికి సానుకూలంగా ఇస్తుంది అనే విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే జరిగితే మరి రాయలసీమ ప్రజాసంఘాలు రాసిన లేఖలకు ఫలితం దక్కే అవకాశాలు ఏమాత్రం ఉండకపోవచ్చు.