ఏపీలో మళ్లీ హోదా హీట్ : అఖిల పక్షం మీటింగ్ 

  • Publish Date - January 29, 2019 / 06:05 AM IST

అమరావతి : ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా హీట్ పెరిగింది. అసెంబ్లీ..పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న క్రమంలో మరోసారి పార్టీలన్నీ విభజన హామీల సాధనకు ఆందోళన బాట పట్టాయి.  ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతను అఖిలపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశానికి అధికారంలో ఉన్న టీడీపీతో సహా జనసేన, వామపక్షాల పార్టీ నాయకులు హాజరుకానున్నారు.  ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో అఖిల పక్ష సమావేశానికి వైఎస్సాఆర్ పార్టీ దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మరోసారి ఏపీలోని పార్టీలోని పార్టీలన్నీ ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన క్రమంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని..ఏపీ ప్రజల వాయిస్ ను ముక్తకంఠంతో వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి.  గత నాలుగున్న సంవత్సరాలుగా విభజన హామీల అమలు..ఇంకా చేయాల్సినవేంటి అనే పలు కీలక అంశాలపై అఖిలపక్షం చర్చించనుంది. టీడీపీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కుటుంబరావులు రాగా, కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి రాగా, జస్టిస్ చలమేశ్వర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
 

ట్రెండింగ్ వార్తలు