మద్యం తాగి బస్ నడిపిన వరుణ్ ట్రావెల్స్ డ్రైవర్ అరెస్ట్

  • Publish Date - May 16, 2019 / 03:49 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ లపై ఎంతగా అవగాహన కల్పించినా ఏమాత్రం చెవికి ఎక్కటంలేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రయివేట్ ట్రావెల్స్  డ్రైవర్లు కూడా ఏమాత్రం అతీతంగా కాదన్నట్లుగా ఉన్నారు.    మే 15న RTA అధికారులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రవ్ తనిఖీలలో ప్రయివేట్ ట్రావెల్స్ కు చెందిన ముగ్గురు డ్రైవర్లు చిక్కిన విషయం తెలిసిందే. అయినా ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నాయి. 

ఈ క్రమంలో బుధవారం (మే 15) రాత్రి  రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా పొట్టిగేటు టోల్ గేట్ వద్ద పలు ట్రావెల్స్ బస్ డ్రవర్లకు బ్రీతింగ్ టెస్ట్ లు నిర్వహించగా వరుణ్ ట్రావెల్స్ బస్  డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. అతనిపై కేసు నమోదు కేసిన పోలీసులు బస్సుని నిలిపివేశారు. అనంతరం ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా  వేరే డ్రైవర్ ను నియమించి బస్సుని పంపించివేశారు. 

కాగా యాజమాన్యాల నిర్లక్ష్య ధోరణిపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మద్యం తాగే డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ లకు చెందిన బస్సులను కూడా సీజ్ చేయాలని వారు కోరుతున్నారు.