కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ ఆదివారం(మార్చి 22,2020) జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9
కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ ఆదివారం(మార్చి 22,2020) జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రధాని కోరారు. జనతా కర్ఫ్యూకి ఏపీ సీఎం జగన్ మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. శనివారం(మార్చి 21,2020) రాత్రి నుంచి దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఉండవని ఏపీ రవాణ శాఖ మంత్రి పేర్నినాని చెప్పారు.
See Also | జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్‌ని చంపేందుకు ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్
ఆదివారం(మార్చి 22,2020) రాత్రి 9 తర్వాత బస్సు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా కట్టడికి ప్రధాని మోడీ పిలుపు మేరకు బస్సులు నిలిపివేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. అలాగే ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని, దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలిపివేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సర్వీసుల రద్దుని అదునుగా తీసుకుని అధికా చార్జీలు వసూలు చేయొద్దని ఆటో, టెంపో, ట్యాక్సీ డ్రైవర్లను మంత్రి కోరారు. అలాగే డబ్బు కోసం ఎక్కువమంది మనుషులను ఆటోలో, టెంపోలో, ట్యాక్సీలో తీసుకెళ్లొద్దన్నారు. ఇది చాలా ప్రమాదం అన్నారు.
జనతా కర్ఫ్యూకు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ సంఘీభావం తెలిపింది. ఏపీలో పెట్రోల్ బంక్ లు బంద్ చేయాలని నిర్ణయించింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్చంగా బంక్ లు మూసివేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ ఆదివారం పెట్రోల్ బంక్ లు బంద్ కానున్నాయి. జనతా కర్ఫ్యూకు మద్దతుగా పెట్రోల్ బంకులు బంద్ చేయాలని నిర్ణయించారు. అత్యవసర సర్వీసుల కోసం కొన్ని బంకులు తెరిచి ఉంచుతామని పెట్రో ట్యాంకర్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు.