ఇసుక వివాదం : అన్నవరపులంకలో కర్రలతో కొట్టుకున్నా గ్రామస్తులు

  • Publish Date - November 25, 2019 / 08:11 AM IST

గుంటూరు జిల్లా కొల్లిపొరకలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇసుక కోసం గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఇసుక తవ్వకాల్లో తలెత్తిన వివాదం కాస్తా..ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. అన్నవరపు లంక ఇసుక రీచ్ వద్ద నెలకొన్న ఘర్షణ కాస్తా కర్రలతో కొట్టుకునేదాకా వెళ్లింది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు ఒకరిపై ఒకరు కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇద్దరికి  తలలు పగిలాయి. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఇసుక రీచుల్లో ఏర్పడిన అవకతవకలు..లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామస్తుల మధ్య ఏర్పడిన వివాదం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాజకీయ నేతలతో పాటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. గ్రామస్తుల మధ్య సమన్వయానికి ముగ్గురు ఎస్సైలు..ఒక సీఐ..పలువురు వైసీపీ నేతలతో పాటు గ్రామ పెద్దలు కలిసి సమస్య పరిష్కారానికి యత్నించారు.  యత్నించారు. కానీ సాధ్యం కాలేదు.  చిలికి చిలికి గాలివానగా మారిన వివాదం కొట్టుకునేదాకా వెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.