సోయా బొబ్బట్లు, సున్నుండలు తయారీ విధానం

సంక్రాంతి సంబరాలకు ఘుమఘుమలాడే పిండి వంటలు తోడైతే ఆ సంతోషమే వెరు... కొత్త అల్లులు, చిచ్చర పిడుగుల్లాంటి మనవళ్లు, మనవరాళ్లకు గారంగా అందించే పిండివంటలు. మరి ఇంకెందుకు ఆలస్యం పిండి వంటల తయారీ చూసేద్దాం...  

  • Publish Date - January 10, 2019 / 09:11 AM IST

సంక్రాంతి సంబరాలకు ఘుమఘుమలాడే పిండి వంటలు తోడైతే ఆ సంతోషమే వెరు… కొత్త అల్లులు, చిచ్చర పిడుగుల్లాంటి మనవళ్లు, మనవరాళ్లకు గారంగా అందించే పిండివంటలు. మరి ఇంకెందుకు ఆలస్యం పిండి వంటల తయారీ చూసేద్దాం…  

సంక్రాంతి సంబరాలకు ఘుమఘుమలాడే పిండి వంటలు తోడైతే ఆ సంతోషమే వెరు… కొత్త అల్లులు, చిచ్చర పిడుగుల్లాంటి మనవళ్లు, మనవరాళ్లకు గారంగా అందించే పిండివంటలు. మరి ఇంకెందుకు ఆలస్యం పిండి వంటల తయారీ చూసేద్దాం…  

సోయా బొబ్బట్లు:
కావలిసిన పదార్ధాలు:
మైదా, సోయా గింజలు ఆరు కప్పులు, బెల్లం తురుము ఐదు కప్పులు, ఎండుకొబ్బరి అరకప్పు, యాలకులపొడి చెంచా, నెయ్యి అరకప్పు, నూనె తగినంత. 
తయారీ విధానం:
సోయాగింజల్ని ముందురోజే నానబెట్టుకోవాలి. మైదాలో కొంచం ఉప్పు, నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. తరవాత ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. చల్లారాక నీరు వంపేసి మిక్సీలో పొడిలా చేసుకోవాలి. వెడల్పాటి పాత్రలో అరకప్పు నీళ్లు పోసి బెల్లం తురుము వేసి తీగపాకం పట్టాలి. ఇందులో యాలకులపొడి, కొబ్బరి పొడి, సోయా మిశ్రమం వేసి కలబెట్టాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే తడిచేత్తో చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు నానిన మైదాను మరోసారి కలిపి చపాతీ మాదిరి చేసి మధ్యలో సోయా మిశ్రమాన్ని ఉంచి బొబ్బట్టులా చేసుకోవాలి. ఒక్కోదాన్ని పెనం పై రెండు వైపులా కల్చితే సరిపోతుంది. కమ్మని సోయా బొబ్బట్లు రెడీ.

సున్నుండలు:
సున్నండ.. ఈ పేరు వింటనే చాలు నోట్లో లాలాజాలం ఊరిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే వంటకం. తియ్యని సున్నండను ఎలా తయారుచేయాలో తెలుసా?
కావలిసిన పదార్ధాలు:
మినపప్పు కిలో, పంచదార ముప్పావుకిలో, నెయ్యి అరకిలో.
తయారీ విధానం:
మినపప్పును దోరగా వేయించాలి. చల్లారాక మిక్సీలో వేసి బరకగా చేసుకోవాలి. ఇప్పుడు పంచదారను విడిగా మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ రెండింటినీ కలపాలి. కరిగించిన నెయ్యి చేరుస్తూ లడ్డూల్లా ఉండకట్టాలి. ఆరాక గాలిచొరని డబ్బాలోకి తీసుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి.