కొమ్రుంభీం జిల్లాలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌లను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి… దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.
కొమ్రుంభీం జిల్లాలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌లను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి… దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేశారు. వీరు చేసిన నేరం ఘోరమైనదని వ్యాఖ్యానించారు. 376 డీ సెక్షన్ కింద షేక్‌బాబుకు ఉరిశిక్ష వేస్తున్నట్లు ప్రకటించిన కోర్టు.. అతడితోపాటు మరో ఇద్దరికి ఉరిశిక్ష విధించింది. మరోవైపు.. కోర్టు తీర్పుపై సమత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తీర్పు సందర్భంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడుతూ.. మీపై నేరం రుజువైందని, కోర్టుకు ఏమైనా చెప్పుకునేది ఉందా అని దోషులను ప్రశ్నించారు. దీంతో ప్రధాన నిందితుడు షేక్ బాబు.. తనకు ప్రాణభిక్ష పెట్టాలని కంటతడి పెడుతూ న్యాయమూర్తిని వేడుకున్నాడు. మిగతా నిందితులు కూడా తమకు చిన్న పిల్లలున్నారని, కుటుంబానికి పెద్ద దిక్కు తామేనని వాపోయారు. తమను వదిలేయాలని వేడుకున్నారు.
గత ఏడాది నవంబర్ 24 లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమతపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను కిరాతకంగా చంపేశారు. గ్రామాల్లో తిరుగుతూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా వెళ్తుండటాన్ని గమనించిన ముగ్గురు కామాంధులు ఆమెను అపహరించి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. పోలీసులు కేవలం 20 రోజల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు.
సమత ఘటనపై డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఇక డిసెంబర్ 14న 90 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు.. డిసెంబర్ 23 నుంచి 31 వరకు సాక్షులను కోర్టు విచారించింది. నిందితుల తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించిన కోర్టు నియమించింది. దోషులకు ఉరిశిక్ష వేయడంపై సమత భర్త హర్షం వ్యక్తం చేశారు.