దీపావళి రోజు నువ్వుల నూనె వాడితే..కలిగే లాభాలు

  • Publish Date - October 25, 2019 / 02:08 AM IST

దీపావళి అంటే దీపాల పండుగ. ఈ పండుగ రోజు ప్రతొక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ప్రతి రోజు కొన్ని పనులు చేస్తే..ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చని పండితులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందామా? 

దీపావళి పండుగ రోజున ఉదయాన్నే నువ్వుల నూనె తలకి, శరీరానికి రాసి కాసేపు మర్దన చెయ్యాలి. ఆ తర్వాత కుంకుడుకాయ, సున్నిపిండితో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే నరకబాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అంతేకాదు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో అందరూ ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలతో ఉంటారట. ఎందుకంటే నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ఈ రోజు స్వాతీ నక్షత్రం ఉన్నప్పుడు నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలస్నానం,  దీపారాధన చేయాలి.