ఏపీ మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ 

  • Publish Date - April 26, 2019 / 03:35 AM IST

ఏపీలో మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ రెడీ అయ్యాయి. మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకట్ట వేసేందుకు శక్తి టీమ్స్ పూర్తిస్థాయి ట్రైనింగ్ తీసుకున్నాయి. మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలకు నియంత్రించటమేకాక..వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందు ఈ శక్తి టీమ్స్ పనిచేస్తాయి. ఈ క్రమంలో ఏపీ మహిళల రక్షణ కోసం వారిలో ఆత్మస్థైర్యాని పెంచడమే లక్ష్యంగా శక్తి టీమ్స్‌కు శ్రీకారం చుట్టామని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ తెలిపారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా ఏర్పాటుచేసిన శక్తి టీమ్స్‌ను ఆర్కే బీచ్‌లో గురువారం (ఏప్రిల్ 25)న ఠాకూర్  జెండా ఊపి ప్రారంభించారు. 
 

ఇప్పటికే విజయవాడలో శక్తిటీమ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖలో అతి త్వరలో తిరుపతిలో కూడా శక్తి టీమ్స్ ను ప్రారంభించనున్నామని ఠాకూర్ తెలిపారు.విశాఖలో 35 మంది మహిళా కానిస్టేబుళ్లను సెలెక్ట్ చేసి చేసి విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్ సెంటర్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. వీరంతా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ పనిచేస్తారనీ..కానీ భవిష్యత్తుల్లో పూర్తిస్థాయి సమయంలో పనిచేసేలా మరిన్ని శక్తి టీమ్స్ ను ఏర్పాటు చేయాలనే యోచన ఉందని