కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్థిని ఆత్మహత్య

  • Publish Date - October 28, 2019 / 07:46 AM IST

విశాఖపట్నం కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్ధిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  బైపీసీ ఫైనల్ ఇయర్  చదివే బేబీ శివలక్ష్మి హాస్టల్  రూమ్ లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

శివలక్ష్మిది అనకాపల్లి. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి కారణం కాలేజీ  టీచింగ్‌ సిబ్బంది వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివలక్ష్మి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం (అక్టోబర్ 27)న తమతో ఫోన్ మాట్లాడిన తమ బిడ్డ మరునాడే మృతి చెందటంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.