సేవలు మరువలేం :వింజమూరి అనసూయాదేవి మృతికి బాబు సంతాపం

  • Publish Date - March 24, 2019 / 06:16 AM IST

అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ సంగీత గాయని, వింజమూరి అనసూయాదేవి మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ..దేశభక్తి గీతాలు, జానపదగీతాలాపనతో కళామతల్లికి సేవచేశారని కొనియాడారు. అనసూయాదేవి సోదరి వింజమూరి సీతాదేవితో కలసి వేలాది గీతాలు ఆలపించారని చంద్రబాబు గుర్తు చేసారు. అనసూయాదేవి లేని లోటు తీర్చలేనిదని అన్నారు. వింజమూరి అనసూయ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి  తెలిపారు చంద్రబాబు. 

 
ప్రముఖ జానపద శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి (99) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె అమెరికాలోని హ్యూస్టన్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయాదేవి.. దేవులపల్లి కృష్ణశాస్త్రికి మేనకోడలు. అనసూయాదేవికి ఐదుగురు సంతానం. ఆమె ఏయూ నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్‌ అందుకున్నారు. ఆలిండియా రేడియో ద్వారా…తెలుగు జానపద గీతాలకు ప్రాచుర్యం కల్పించారు.
 

ట్రెండింగ్ వార్తలు