శివరాత్రి పర్వదినం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని శివాలయంలో శివరాత్రి సందర్బంగా అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. ఈ అగ్నిగుండలో నడిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది.
ఈ తోపులాటలో ప్రమాదవశాత్తు ఆరుగురు భక్తులు నిప్పులగుండలో పడిపోయారు. దీంతో పలువరు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యారు. వీరిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఆరుగురిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావటంతో వారి పరిస్థితి విషయమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
కాగా..అగ్నిగుండంలో నడిచేందుకు భక్తుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒకరి వెంట మరొకరు ఏమాత్రం సమన్వయం లేకుండా తోసుకున్నారు. నిప్పుల గుండంలో నడవాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలో ఒకరిని మరొకరు తోసుకుంటూ నిప్పుల గుండంలో పడిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది.