దారుణం : ఏడు నెలలుగా బాలుడిపై ఆరుగురు లైంగిక దాడి

  • Publish Date - December 25, 2019 / 04:42 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో వికృతదాడి ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిపై ఆరుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాలపడ్డారు. గత ఏడు నెలల ఈ దారుణాన్ని కొనసాగిస్తున్నారు సదరు దుర్మార్గులు. ఈ విషయం ఎవరికైనా చెబితే..చంపేస్తామని బాలుడ్ని బెదిరించటంతో భయపడిన చిన్నారి బైటలేదు.

దీంతో బాలుడి భయాన్ని ఆసరాగా తీసుకున్న ఆ ఆరుగురు వ్యక్తులు మరింతగా రెచ్చిపోయిన బాలుడ్ని నరక యాతనకు గురిచేస్తున్నారు. ఏడు నెలలుగా వారి అఘాయిత్యంతో నరకాన్ని చూస్తున్న బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 

దీంతో బాలుడ్ని తల్లిదండ్రులు ఏం జరిగింది అని అడిగినా దుర్మార్గులు ఏం చేస్తారోననే భయంతో చెప్పలేదు. కానీ.. తల్లిదండ్రులు గట్టిగా నిలదీయటంతో అసలు విషయాన్ని బైటపెట్టటంబతో ఈ వికృతం బైటపడింది. ఈ విషయం విన్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సదరు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లు కావటంతో వారిని జువలైనల్ జస్టిస్ బోర్డుకు తరలించారు.