మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు.. వారికి ఆత్మరక్షణ కల్పించేందుకు అద్భుతాన్ని సృష్టించారు ఇద్దరు చిన్నారులు. ముట్టుకుంటే షాక్ కొట్టే జాకెట్‌ను తయారు చేశారు.
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు.. వారికి ఆత్మరక్షణ కల్పించేందుకు అద్భుతాన్ని సృష్టించారు ఇద్దరు చిన్నారులు. ముట్టుకుంటే షాక్ కొట్టే జాకెట్‌ను తయారు చేశారు. ఉమెన్ ప్రొటెక్షన్ జాకెట్‌గా పేరుపెట్టి… జగిత్యాలలో నిర్వహించిన సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఫేర్‌లో దానిని ప్రదర్శించారు. దిశ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం ఈ జాకెట్ తయారీ ఆసక్తి రేపుతోంది.
ఉమెన్ ప్రొటెక్షన్ జాకెట్‌లో ఎన్నో స్పెషాలిటీలున్నాయి. దీనిని ధరించే మహిళలకు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. వారి మాన, ప్రాణాలను కాపాడటమే కాకుండా… అపరిచితులెవరైనా జాకెట్ టచ్ చేస్తే ఒక్క బటన్ నొక్కితే చాలు.. ఎదుటివారికి షాక్ కొట్టి స్పృహ తప్పేలా చేస్తుంది. అంతేకాదు.. అవసరానికి అనుగుణంగా షాక్ తీవ్రతను పెంచుకునేలా రూపొందించబడింది. అంటే.. స్పృహతప్పేలా చేయడమేకాదు… నాడీ వ్యవస్థ పనిచేయకుండా, కాళ్లు చేతులు మొద్దుబారేలా చేస్తుంది. సెల్‌ఫోన్‌తో ఈ జాకెట్ కనెక్ట్ అయివుండటం వల్ల జీపీఎస్ ద్వారా ఫోన్‌లోని ఐదు కాంటాక్ట్ నెంబర్లకు, పోలీస్ స్టేషన్‌కి లొకేషన్ సమాచారాన్ని చేరవేస్తుంది.
రాగి, అల్యూమినియం తీగలతోపాటు కెపాసిటర్, కండెన్సర్, ట్రాన్సిస్టర్, బ్యాటరీ స్విచ్, సర్క్యూట్ బోర్డు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఈ జాకెట్‌ను తయారు చేశారు. ఇది ఫుల్‌గా వాటర్ ప్రూఫ్. పగలు సూర్యరశ్మితో ఛార్జింగవడం ఈ జాకెట్ ప్రత్యేకత. విద్యుత్ ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం కూడా ఉంది. 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. 48 గంటలు నిరంతరాయంగా పని చేస్తుంది.
* షాక్ కొట్టే జాకెట్ తయారు చేసిన విద్యార్థినులు
* ఎక్కడ టచ్ చేసినా షాక్ కొట్టనున్న జాకెట్
* క్షణాల్లో పోలీసులకు, బంధువులకు లొకేషన్ షేర్
* అరగంట ఛార్జ్ చేస్తే 48 గంటలు వర్కింగ్
* సూర్యరశ్మితోనూ ఛార్జింగ్ చేసుకునే సదుపాయం