తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్కాజిగిరి నియోజకవర్గ ఎంపీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో మరోసారి గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. రేవంత్ రెడ్డి నియోజకవర్గం అయిన కొడంగల్‌లో 12 వార్డులకు గాను టీఆర్ఎస్ ఎనిమిదింటిని సొంతం చేసుకుంది. మూడింటిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి విస్తృతంగా తిరిగినా కూడా ప్రభావం పెద్దగా చూపలేకపోయారు. టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించి మున్సిపల్‌ని కైవసం చేసుకుంది.
తెలుగుదేశం తరపున కొడంగల్‌లో వరుసగా రెండు సార్లు గెలిచిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలకనేతగా ఎదిగారు. తరువాతి పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన రేవంత్ గెలుపొంది పార్లమెంటుకు వెళ్లారు.