భూమిని ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసేందుకు లంచం అడిగిన తహశీల్దార్

కర్నూలు జిల్లాలో వీఆర్‌వో లెటర్‌ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్‌వో రైతుకు తెలిపారు.

  • Publish Date - November 27, 2019 / 03:15 PM IST

కర్నూలు జిల్లాలో వీఆర్‌వో లెటర్‌ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్‌వో రైతుకు తెలిపారు.

కర్నూలు జిల్లాలో వీఆర్‌వో లెటర్‌ సంచలనం రేపుతోంది. కొత్తపల్లి తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్‌వో సాయిబాబా రైతుకు తెలిపారు. కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన ఏసన్న భూమిని ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసేందుకు కొత్తపల్లి ఎమ్మార్వో కుమారస్వామి లంచం డిమాండ్ చేసినట్లు వీఆర్‌వో సాయిబాబా లెటర్‌లో పేర్కొన్నారు.
 
తన భూమిని ఆన్‌లైన్‌లో ఎందుకు ఎంటర్‌ చేయడం లేదో.. చెప్పాలని రైతు ఏసన్న సమాచార చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై స్పందించిన వీఆర్‌వో.. తహశీల్దార్‌ రూ.10 వేలు లంచం వసూలు చేయమని తనపై పదే పదే ఒత్తిడి చేశారని రైతు ఏసన్నకు తెలిపారు. తాను అవినీతికి పాల్పడలేక.. సమాధానం చెప్పలేదని.. ఇందులో తన తప్పేమి లేదని వీఆర్‌వో లెటర్ ద్వారా తెలిపారు.
 

ట్రెండింగ్ వార్తలు