జగన్‌..దమ్ముంటే ఇప్పుడు అమరావతి గ్రామాల్లోకి రండి

  • Publish Date - January 3, 2020 / 08:04 AM IST

సీఎం జగన్ కు టీడీపీ నేత సవాల్ విసిరారు. జగన్..రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పాదయాత్ర చేయగలరా అని సవాల్ విసిరారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో..కనీసం ఒక్క గ్రామంలో అయినా పాదయాత్ర చేయగలరా? అని ప్రశ్నించారు. జగన్ నే కాదు ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే అక్కడ తిరగగలరా అని ప్రశ్నించారు. కనీసం రైతుల నిరసన గురించి మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. 

ఏపీ రాజధాని విషయంలో వైసీపీ..టీడీపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం హీటెక్కుతోంది.  అమరావతిలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు..ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తుంటే..అమరావతి నుంచి రాజధాని తరలించేందుకు కుట్రలు పన్నుతున్న వైసీపీ ప్రభుత్వం విశాఖలో భారీ ఎత్తున భూములు కొన్నారని టీడీపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. 

రోజు రోజుకీ ఈ మాటల తూటాలు వేడి ముదురుతోంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లనాని ఆరోపిస్తుంటే..విశాఖపట్నంలో వేలాది ఎకరాలు గత ఆరు నెలల్లో చేతులు మారాయనీ టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.విశాఖలో జరుగుతున్న భూ దందాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని దేవినేని డిమాండ్ చేశారు. 

ట్రెండింగ్ వార్తలు