అమరావతి రాజధాని గురించి కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానం చేస్తారని సమాచారం. ఈ మేర అధికార పార్టీతో పాటు టీడీపీ కూడా సభలో తమ గొంతు వినిపించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే నిరసన తెలియజేస్తూ పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకోనున్నారు.
సేవ్ అమరావతినే పార్టీ అజెండాగా ముందుగా సాగుతున్నారు. టీడీపీ ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఒక చోటుకు చేరుకుని పాదయాత్రగా వెళ్లనున్నారు. పార్టీలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయా అన్నట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల నిమిత్తం ఆదివారం టీడీఎల్పీ సమావేశం జరిగింది. దీనికి 12మంది ఎమ్మల్సీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడమే ఈ అనుమానాలకు కారణం.
అనగాని సత్యప్రసాద్.. టీడీపీ ఎమ్మెల్యేమాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతులు ఐదు కోట్ల మంది భవిష్యత్ కోసం.. ఇచ్చిన భూమి ఇది. వాళ్లంతా రోడ్డు మీదపడ్డారు. వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. శంకుస్థాపన సమయం నుంచి వాళ్లు కూడా అమరావతి రాజధాని అనే నిర్ణయాన్ని సమర్థించారు. ప్రతిపక్ష నేతలు ఒప్పుకున్న తర్వాతే అమలుచేశాం. పెయిడ్ ఆర్టిస్టులని విమర్శలు చేయడం తగదు అని వెల్లడించారు.