పొట్టేలు కోసం : తలలు పగలకొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు

  • Publish Date - April 24, 2019 / 05:19 AM IST

అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బుక్కరాయసముద్రం మండలం చెద్దల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయులు కొట్టుకున్నారు. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొట్టేలు విషయంలో తలెత్తిన వివాదం ఈ ఘర్షణకు కారణం అని పోలీసులు చెబుతున్నారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.