నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గర్భిణీ డెలివరీ సమయంలో శిశువు తల తెగిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై వేటు వేసింది.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గర్భిణీ డెలివరీ సమయంలో శిశువు తల తెగిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై వేటు వేసింది. కడుపులోనే శిశువు మృతికి కారణమైన డాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని మెడికల్ కౌన్సిల్ కు కంప్లైట్ చేయనున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టరు శ్రీనవాసులు చెప్పారు. డెలివరీ చేసే సమయంలో తల, మొండెం వేరైన విషయాన్ని పెషేంట్ కుటుంబ సభ్యులు, అధికారుల వద్ద దాచినట్లు గైనకాలజీల ప్రొఫెసర్ల కమిటీ తేల్చింది.
ఈ నేపథ్యంలో మహిళ డెలివరీలో పాల్గొన్న అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డా.తారాసింగ్, మెడికల్ ఆఫీసర్ డా.సుధారాణిని సస్పెండ్ చేస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై ఇప్పటికే కమిటీ విచారణ పూర్తి చేసింది. ఇవాళ ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. వైద్యశాఖ ఇప్పటికే ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసింది. హైదరాబాద్ లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో తల్లి స్వాతి చికిత్సపొందుతోంది.
అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచేశాయి. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. సినిమా దృశ్యాన్ని తలపించేలా వైద్యులు సీన్ క్రియేట్ చేశారు. శిశువు తల తెగగానే గోప్యంగా అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. తల గురించి బంధువులు అడిగితే తమకు తెలియదని బుకాయించారు. కేస్ షీట్ కూడా ఇవ్వకుండా వైద్యులు పేషెంట్ ను తరలించారు. సూపరింటెండెంట్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ఘటనపై విచారణ జరిపేందుకు అధికారులు కమిటీ వేశారు.
నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి అనే గర్భిణి ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అయితే కాన్పు సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యులు శిశువు తల కోసేశారు. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. పరిస్థితి సీరియస్ గా ఉందని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. శిశువు తల తెగగానే గోప్యంగా అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. శిశువు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆగ్రహించిన గర్భిణి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ప్రసవ సమయంలో డాక్టర్లు శిశువు మొండెం నుంచి తలను వేరుచేశారని ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి దగ్గరకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రసవ సమయంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు, వైద్య సిబ్బందిపై బాధితురాలి బంధువులు దాడికి ప్రయత్నించారు.