కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన జగన్ సర్కార్, తెలంగాణ తరహాలో ఆంక్షలు విధించనుంది. ఉదయం, సాయంత్రం
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన జగన్ సర్కార్, తెలంగాణ తరహాలో ఆంక్షలు విధించనుంది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాల్లోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత భద్రత సామాజిక బాధ్యత అని గుర్తించాలన్నారు.
కరోనా నియంత్రణలో విదేశాల నుంచి మరిన్ని విషయాలు నేర్చుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణ అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. కరోనాపై ప్రజలకు మరింత అవగాహన పెరిగిందన్నారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని గౌతమ్ సవాంగ్ కోరారు. పరిస్థితులను అర్థం చేసుకోకుండా కొందరు పోలీసులను ప్రశ్నిస్తున్నారని డీజీపీ మండిపడ్డారు. పోలీసులతో గొడవకు దిగడం సరికాదన్నారు. రోజురోజుకి రిస్క్ పెరుగుతున్న కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్.
లాక్ డౌన్ రెండో రోజుకు మంచి స్పందిన వచ్చిందని డీజీపీ అన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, స్వచ్చందంగా సహకరించారని చెప్పారు. కరోనా నివారణ చర్యలను మరింత కట్టుదిట్టంగా పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. విదేశాలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గ్రహించి ఏపీ ప్రజలు ప్రవర్తించాలన్నారు. అవసరం లేకున్నా రోడ్డుపై తిరిగే వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు దాస్తే కుటుంబసభ్యులపై కేసులు పెడతామని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ వియజవంతం అయితేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలం అన్నారు. కరోనా మూడో దశలోకి వెళ్లకుండా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు.