పొలం ఇచ్చిన మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన కౌలు రైతు: పెట్రోల్ పోసి హత్యాయత్నం

  • Publish Date - December 26, 2019 / 10:18 AM IST

పొలాన్ని కౌలుకు తీసుకున్న కౌలు రైతు భూమికి చెందిన యజమానురాలిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. చెట్టుకు కట్టేసి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. నీ పొలాన్ని నా పేరున రాసివ్వాలని కిన్నెర్ల అంజలి అనే భూ యజమానురాలిని దారుణంగా కొట్టిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రుల పల్లిలో చోటుచేసుకుంది. 

వివారాలు : కిన్నెర్ల అంజలి అనే మహిళ మంచిర్యాల జిల్లా జైపూర్ లో నివసిస్తోంది. ఆమెకు ఉన్న పొలాన్ని కౌలుకు చేసుకుంటానని శాస్త్రుల పల్లికి చెందిన గుండపు మధునయ్య అనే కౌలు రైతు కిన్నెర్ల అంజలిని అడిగటంతో మధునయ్యకు కౌలుకు ఇచ్చింది. ఇలా కొంతకాలం కౌలు డబ్బులు బాగానే ఇచ్చారు. తరువాత ఆ పొలంపై కన్నేసిన మధునయ్య ఎలాగైనా సరే పొలాన్ని సొంతం చేసుకోవాలని దురాశకు పోయాడు. ఈ క్రమంలో అంజలి తన పొలానికి వెళ్లింది.

ఇదే అదనుగా భావించిన మదునయ్య అమెపై దాడి చేశాడు. ఆమె చీరను చింపేసి ఆ చీరతోనే ఆమెను అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసాడు. ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. ఈ పొలాన్ని నాకు అమ్మేసినట్లగా కాగితంపై సంతకాలు చేసి ఇవ్వాలని బలవంత పెట్టాడు. దీనికి అంజలి ఒప్పుకోకపోవటంతో ఆమెను ఉదయం నుంచి సాయంత్రం వరకూ హింసిస్తూనే ఉన్నాడు. మదునయ్య చేసే దారుణానికి అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. అంజలిని వారు కూడా కొట్టారు. అలా సాయంత్రం వరకూ ఆమెను పేపర్స్ పై సంతకాలు చేయాలని  హింసిస్తునే ఉన్నారు. అలా ఆమెపై పెట్రోలు పోసి చంపేయాలని అనుకున్నారు. 

ఉదయం అనగా పొలానికి వెళ్లిన తల్లి సాయంత్రం అయినా రాకపోయేసరికి ఆందోళన చెందని అంజలి కుమారుడు తల్లిని వెతుక్కుంటూ పొలానికి వెళ్లాడు. అలా వెళ్లిన అతనికి చెట్టు కట్టేసి ప్రాణాపాయస్థితిలో ఉన్న తల్లిని చూశాడు. పరుగు పరుగున వెళ్లి కట్టు విప్పి విడిపించాడు. వెంటనే మంధుని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

దీంతో మధునయ్యను పిలిపించి పోలీసులు విచారించగా..తను సాగు చేస్తున్న పొలాన్ని 2008లోనే తనకు అమ్మేసారిని బుకాయిస్తున్నాడు మదునయ్య. అంజలిపై దాడికి తమకు ఎటువంటి సంబంధంలేదనీ అంటున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.