అమరావతి ప్రాంతంలోని మందడం, తుళ్లూరు గ్రామాలు అట్టుడికిపోతున్నాయి. సంక్రాంతి పండుగ దగ్గరకొస్తున్న తరుణంలో పండుగ సందడికి బదులు నిరసనలతో అట్టుడిపోతోంది అమరావతి ప్రాంతం. పోలీసులు బూట్ల శబ్దాలతో..గ్రామస్థులు నినాదాలతో..నిరసనలు..ఆందోళనలు..నినాదాలతో దద్దరిల్లిపోతోంది. గత 24 రోజుల నుంచి ఇదే వాతావరణం నెలకొంది అమరావతి ప్రాంత గ్రామాల్లో.
పోలీసులకు..గ్రామస్తులు..గ్రామ మహిళలకు మధ్య వాగ్వాదాలో అట్టుడికిపోతోంది.ఈ క్రమంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతిపై ముగ్గురు పోలీసులు విరుచుకుపడ్డారు. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు యువతిని తోసివేశారు. ఇష్టమొచ్చినట్లుగా దుర్భాషలాడుతూ తోసిపడేశారు. ఈ తోపులాటలో కొంతమంది మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. అమరాతిని విశాఖపట్నానికి తరలించవద్దని మందడం…తుళ్లూరు గ్రామ మహిళలు మొక్కుకున్నారు.
ఆయా గ్రామాల నుంచి ఇంద్రకీలాద్రిపై వెలసిన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ దగ్గరకు ర్యాలీగా వెళేందుకు సిద్దమైన మహిళలపై పోలీసులు అరాచకంతో మందడం..తుళ్లూరు గ్రామాల్లో ఈరోజు వేకువఝామునుంచే ప్రారంభమైంది. అయినా పోలీసులకు ఏమాత్రం భయపడని మహిళలు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని నినదిస్తున్నారు.డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘర్షణ వాతావరణంలో ఎంతోమంది మహిళా రైతులకు తీవ్ర గాయాలయ్యాయి.