తిరుమలలో ఉత్సవ విగ్రాహాలు అరిగిపోతున్నాయి. దీనిపై ఆగమ సలహా మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో తిరుమల ఏడుకొండలపై వెలిసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవల్లో మార్పులు చేసే యోచనలో టీటీడీ ఉంది. తిరుమలలో నిత్యం నిర్వహించే వసంతోత్సవం, కళ్యాణోత్సవం, వారపు సేవలైన సహస్ర కలశాభిషేకం, విశేషపూజల్ని టీటీడీ రద్దు చేయాలను ఆగమ సలహా మండలి సూచించింది.
నిత్యం స్నపన తిరుమంజనం నిర్వహిస్తుండటంతో 600 ఏళ్లనాటి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విగ్రహాలు అరిగిపోతున్నాయని..ఆగమ సలహా మండలి ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ పురాతన ఉత్సవ విగ్రహాలకు పగుళ్లు కూడా వచ్చాయని సమాచారం. దీంతో ఆర్జిత సేవల్ని రద్దు చేసి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించాలని ఆగమసలహా మండలి..సూచిస్తోంది. దీంతో శ్రీవారి ఆర్జిత సేవల్ని రద్దు చేసే యోచనలో టీటీడి ఉన్నట్లు సమాచారం.