తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరకు కొట్టుకొచ్చిన మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇంకా 15 మంది ఆచూకీ తెలియలేదు. మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈక్రమంలో కాసేపటి క్రితం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరకు మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయన్న సమాచారం అందుతోంది.
అయితే ఇవి బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఇవి చాలా రోజులుగా నీటిలోనే ఉన్నాయని తెలుస్తోంది. అయితే కచ్చులూరు బోటు ప్రమాదంలో ఎవరైతే గల్లంతయ్యారో వారి మృతదేహాలుగా స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి అప్ డేట్స్ తెలియాల్సివుంది.
లభ్యం కాని మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. దీన్ని ధృవీకరించేందుకు మృతదేహాలను రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అక్కడికి తరలించి డీఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.
సెప్టెంబర్ 15న గండిపోచమ్మ ఆలయం నుంచి 77 మందితో బయలుదేరిన వశిష్ట బోటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర సుడిగుండాల్లో చిక్కుకుని మునిగిపోయింది. వారిలో 26 మందిని స్థానికులు, మత్స్యకారులు కాపాడారు. 36 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో 15 మంది ఆచూకీ తెలియాల్సివుంది.
బోటు వెలికితీత పనులను ప్రభుత్వం కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ సంస్థకు అప్పగించింది. అయితే ఐదు రోజులుగా వాతావరణం సహకరించకపోవడంతో బోటు వెలికితీత సాధ్యం కాలేదు.