కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కొల్లూరు సమీపంలో కుందూ నదిలో దూకి ఓ కుటుంబ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. మృతులు రాజుపాలెం మండలం గారెగూడూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితుల సమస్యలతోనే సదరు కుటుంబ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతులు తిరుపతి రెడ్డి, భార్య వెంకట లక్ష్మమ్మ, కుమార్తె ప్రవల్లికలుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గ్రామస్థులకు విచారించగా..కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. వీరు ముగ్గురు ఆత్మహత్య చేసుకునేందుకు గురువారం (సెప్టెంబర్ 19) ఉదయం కుందూ నదీ సమీపానికి బైక్ పై వచ్చారు. తరువాత ముగ్గురు పెద్ద పెద్ద రాళ్లును తాడుకు కట్టి..ఆ తాళ్ళను నడుములకు కట్టుకుని నదిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి మృతదేహాల కోసం కుందూ నదిలో సహాయక బృందాలతో గాలిస్తున్నారు.