నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడిపోయాడు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడిపోయాడు. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే బాలుడి తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.