కుప్పకూలిన శిక్షణ విమానం : ఇద్దరు పైలట్లు మృతి

  • Publish Date - October 6, 2019 / 10:20 AM IST

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్ పూర్ దగ్గర శిక్షణ విమానం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. పత్తిచేనులో విమానం కూలడంతో శిక్షణలో ఉన్న ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారు. విమానం పూర్తిగా దెబ్బతిందని సమాచారం.

హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి విమానం వెళ్లిందని అనంతరం వికారాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లు అధికారులు చెబుతున్నారు. కూలడానికి ముందు కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టినట్లు స్థానికులు అంటున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ప్రమాదస్థలికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా చేరుకున్నారు.