కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎమ్ఎమ్ పహాడీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

  • Publish Date - November 14, 2019 / 02:04 AM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎమ్ఎమ్ పహాడీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎమ్ఎమ్ పహాడీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. దీంతో తల్లిదండ్రులు గుండెల బాదుకుంటూ రోధిస్తున్నారు. 

చిల్డ్రన్స్ డే సందర్భంగా సరదగా గడిపేందుకు పిల్లలంతా ఏర్పాట్లు చేస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. కలుషిత నీరు కలుస్తున్నాయని చాలా సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌పై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే చిన్నారులు చనిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నవంబర్ (14, 2019) పోస్టుమార్టం నిర్వహించనున్నారు.