బడ్జెట్ 2019లో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. నిరుద్యోగ భృతిని డబుల్ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న నిరుద్యోగ భృతిని వెయ్యి రూపాయాల నుంచి రూ.2వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి రూ.1200కోట్లు కేటాయించారు.
డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న యువత కనీస అవసరాలు తీర్చేందుకు ప్రవేశపెట్టిన పథకాన్ని రెట్టింపు చేస్తూ నిధులు ప్రకటించింది. సాధారణ ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం రూ.2,26,117కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది గతేడాది కంటే 18.39 శాతం అధికం.