జాబు కోసం : పెట్రోల్ బాటిల్స్ తో టవర్ ఎక్కిన మహిళలు 

  • Publish Date - November 4, 2019 / 07:24 AM IST

విజయవాడ రేడియో స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ మహిళలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ పెట్రోల్ బాటిల్స్ తో చేస్తు ఆకాశవాణి (రేడియో)టవర్ ఎక్కారు. సీఎం జగన్ వెంటనే స్పందించి తమకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు సెల్ టవర్ దగ్గర భారీగా మోహరించారు.

13 జిల్లాల నుంచి వచ్చిన గ్రామ సచివాలయ నిరుద్యోగులు రేడియో టవర్ దగ్గర తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరిగిందనీ సీఎం జగన్ వెంటనే స్పందించి న్యాయం చేయాలని కొంతమంది మహిళలు పెట్రోల్ బాటిల్స్ తో  టవర్ ఎక్కారు. వారికి నచ్చ చెప్పేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో రేడియో స్టేషన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

గ్రామ సచివాలయ నిరుద్యోగులు..తాము పరీక్షలు రాసి అర్హత సాధించినప్పటికీ..తమను అనర్హులుగా ప్రకటించారనే ఆవేదనతో వారు రేడియో టవర్ ఎక్కారు.  మహిళా నిరుద్యోగులు తమ చిన్నారులతో సహా వచ్చి నిరసనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..తాను హార్టీ కల్చర్ పోస్ట్ కు పరీక్ష రాసానననీ..మంచి మార్కులు ఎలిజిబుల్ అయ్యాయననీ..కాల్ లెటర్ వచ్చింది. ర్యాంక్ కార్డ్ కూడా వచ్చిందనీ వెరిఫికేషన్ కు కూడా వెళ్లామని ..వెరిఫికేషన్ చేసిన తరువాత మమ్మల్ని రిజక్ట్ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఎంత వరకూ న్యాయమని ప్రశ్నిస్తోంది. తనలాగానే ఎంతోమందికి అన్యాయం జరిగిందని అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. 

దీని కోసం సంబంధిత మంత్రులు..అధికారులు వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదనీ వాపోయారు. వేల సంఖ్యలో ఉండే నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనీ దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించిన తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్  చేస్తున్నారు నిరుద్యోగులు.